ట్రాఫిక్ జామ్ అనేది మన ప్రయాణానికి బ్రేక్ వేసి ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది అన్నది మాత్రమే మనకి తెలుసు కానీ.. అదే ట్రాఫిక్ జామ్ ఓ వ్యక్తి విషయంలో చాలా మంచి పనే చేసింది అని చెప్పాలి ఎందుకంటారా ? అయితే ఇది పూర్తిగా చదవాల్సిందే...
ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో చోటు చేసుకుంది. ఎప్పటిలాగే తన విధులను ముగించుకొని కారులో ఇంటికి బయలుదేరాడు రిజ్వాల్ .. అయితే మార్గమధ్యంలో ఓ కిడ్నాప్ గ్యాంగ్ అతని దగ్గరినుండి కారును బలవంతంగా లాక్కొని అతన్ని కుడా అదే కారులో బంధించి ద్వారక వైపు వెళ్లారు.
ఈ క్రమంలో తన సోదరుడు అనుకున్నా సమయానికి రాకపోవడంతో రిజ్వాల్ సోదరుడు రిజ్వాల్ కి సంబంధించిన వివరాలని పోలీసులకు తెలియజేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి రిజ్వాన్ కారును గుర్తించారు. ఆ తర్వాత దానిని వెంబడించారు. ఈ నేపద్యంలో కారు నజఫ్ గఢ్ వెళ్లే మార్గంలో హెవీ ట్రాఫిక్ తో నిండిపోయింది. దీనితో పోలీసులు తమని ఎక్కడ పట్టుకుంటారో అనే భయంతో ఆ కిడ్నాప్ గ్యాంగ్ ఆ కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. అందులో ఒక్కరిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. అతడిని ఉత్తమ్ నగర్ కి చెందిన క్రిమినల్ రవిగా పోలీసులు గుర్తించారు. రిజ్వాన్ ని సేఫ్ గా కాపాడినందుకు గాను అతని కుటుంబ సభ్యులు పోలీసులకి కృతజ్ఞతలు తెలిపారు.