Himachal Pradesh: పర్యాటకుల అత్యుత్సాహం.. ట్రాఫిక్ జామ్ ఉందని నదిలో డ్రైవింగ్
Himachal Pradesh: కేసు నమోదు చేసి.. చలానా విధించిన పోలీసులు
Himachal Pradesh: ఎవరైనా ట్రాఫిక్ జామ్ అయితే గల్లీల్లో వెళ్తారు.. లేదంటే డివైడర్లు, ఫుట్‌పాత్‌లు ఎక్కించి మరీ స్టంట్లు చేస్తారు. అలాంటి ఆప్షన్లేమీ లేనపుడు క్లియర్ అయ్యాకే వెళ్తారు. కానీ హిమాచల్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి మాత్రం ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకునేందుకు కారును నదిలోకి దింపాడు. వినడానికి వింతగా ఉన్నా..వీడు మామూలోడు కాదంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు ఆ డ్రైవర్.
వరుస సెలవులు కావడంతో హిమాచల్‌ప్రదేశ్ పర్యాటకులతో కిటకిటలాడింది. లహాల్ వ్యాలీ వాహనాలతో కిక్కిరిసిపోయింది. పార్కింగ్‌కు స్థలం లేక బస్సులు, కార్లు రోడ్లపైనే నిలిపేశారు. దీంతో ఆ ట్రాఫిక్ జామ్‌ను తట్టుకోలేకపోయిన థార్ డ్రైవర్ జీపును పక్కనే ఉన్న చంద్రా నదిలో దింపాడు. నదిలో కూడా నీళ్లు తక్కువగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా నది దాటించాడు. అక్కడ ఉన్న పర్యాటకులు వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో ఆధారంగా కారును గుర్తించిన పోలీసులు చలానా విధించినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ మయాంక్. ఇలాంటి ప్రయోగాలు ఎవరైనా చేస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. డ్రైవర్‌పై మోటార్ వెహికిల్ యాక్ట్ 1998 కింద కేసు నమోదు చేశారు.