Top 6 News @ 6 PM: ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేస్తా...రేవంత్: మరో 5 ముఖ్యాంశాలు
Top 6 News @ 6pm: ఇవాళ నవంబర్ 8న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.
Top 6 News @ 6pm: ఇవాళ నవంబర్ 8న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.
1.మూసీ పునరుజ్జీవం కోసం నల్గొండ జిల్లాలో రేవంత్ టూర్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవం కోసం మూసీ వెంట పాదయాత్ర నిర్వహించారు. బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు ఆయన పాదయాత్ర చేశారు. మూసీ వెంట ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆయన ముందుకు నడిచారు. మూసీని పునరుజ్జీవం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆయన పాదయాత్ర చేశారు. సంగెంలో నిర్వహించిన సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మూసీ ఒకప్పుడు జీవనదిగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంతంలో నీళ్లు కలుషితమయ్యాయని చెప్పారు.మూసీ అణుబాంబుగా మారబోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరు అడ్డొచ్చినా మూసీప్రక్షాళన చేసి తీరుతానని ఆయన స్పష్టం చేశారు.
2.విజయవాడ- శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం
విజయవాడ- శ్రీశైలం సీ ప్లేస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలుత విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేస్ శ్రీశైలం జలాశయంలో సురక్షితంగా ల్యాండైంది. ఎస్ డీ ఆర్ ఎఫ్, పోలీస్, టూరిజం అధికారులు ఈ ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు. ఈ నెల 9 పున్నమి ఘాట్ లో విజయవా నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ను నడుస్తుంది. డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ దీన్ని తయారు చేసింది. 14 సీట్ల సీ ప్లేన్ ను చంద్రబాబు ప్రారంభిస్తారు.
3. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట బోర్డు
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని శుక్రవారం యాదగిరిగుట్టలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాభివృద్దిపై సమీక్ష నిర్వహించారు టెంపుల్ బోర్డు ఏర్పాటుకు విధి విధానాలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. విమాన గోపురానికి బంగారం తాపడం పనులను బ్రహ్మోత్సవాలనాటికి పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఆలయానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఆయన అధికారులను కోరారు.
4. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్
వైఎస్ఆర్ సీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో మహబూబ్ నగర్ ప్రాంతంలో రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, విజయమ్మ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత పై సోషల్ మీడియాలో ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని అభియోగాలున్నాయి. ఆయనపై మంగళగిరి, హైద్రాబాద్ లో కేసులు నమోదయ్యాయి. రవీందర్ రెడ్డిని కడప పోలీసులు వదిలివేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కర్నూల్ డీఐజీ ప్రవీణ్ నివేదిక మేరకు జిల్లా ఎస్పీని బదిలీ చేసింది ప్రభుత్వం.
5. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కు అనారోగ్యం
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అనారోగ్యంతో ఉన్నారు. చికిత్స తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. తన ఆరోగ్య సమస్య గురించి తెలిసి ఎంతో భయపడ్డాను. దాన్ని ధైర్యంగా ఎదుర్కునేలా అభిమానులు తనకు ధైర్యం ఇచ్చారన్నారు. తన గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. వచ్చే రెండు నెలల్లో అన్నీ సర్దుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
6. మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు:యూపీ మహిళా కమిషన్
మహిళల దుస్తుల కొలతను పురుషులు తీసుకోవద్దని యూపీ మహిళా కమిషన్ ప్రతిపాదించింది. ఇలాంటి వృత్తుల్లో ఉన్న పురుషులు అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ వేధించేందుకు అవకాశాలున్నాయని కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ చెప్పారు. అమ్మాయిల దుస్తుల కొలతలను మహిళలు తీసుకోవాలి. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సెలూన్ లో మహిళా కస్టమర్లకు అమ్మాయిలే సేవలు అందించాలి. మహిళల వస్తువులు విక్రయించే దుకాణాల్లో తప్పనిసరిగా మహిళా సిబ్బందే ఉండాలని పలు సూచనలు చేసింది మహిళా కమిషన్.