Top 6 News @ 6 PM: జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నా.. కేటీఆర్...మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News @ 6pm: ఇవాళ నవంబర్ 7న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.

Update: 2024-11-07 12:59 GMT

Top 6 News @ 6 PM: జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నా.. కేటీఆర్...మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News @ 6pm: ఇవాళ నవంబర్ 7న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.

1. జైలుకు వెళ్లేందుకు కూడా సిద్దమే: కేటీఆర్

తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్దంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే తాను సిద్దంగా ఉన్నానని ఆయన అన్నారు. గురువారం హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మూలా ఈ రేసింగ్ విషయంలో తనకు ఏసీబీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. తనను జైల్లో పెడితే హ్యాపీగా యోగా చేసుకుంటానని చెప్పారు. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచినందుకు తనపై కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు కేసులను బహుమతిగా ఇస్తారా అని ఆయన అడిగారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఆయన సీఎంను కోరారు. .రేవంత్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

2.ఆడపిల్లలను కించపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు: చంద్రబాబు

ఆడపిల్లలను కించపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. దీని కోసం అవసరమైన చట్టాలు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ జీఐఎస్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అధికారానికి దూరమైన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బాంబులకు కూడా భయపడలేదు... కానీ అసెంబ్లీలో తన భార్య గురించి దుర్మార్గంగా మాట్లాడినప్పుడు కన్నీళ్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

3.షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు

బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ ను చంపుతామని బెదిరింపులు వచ్చాయి. రూ. 50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. షారూక్ ఖాన్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్లు 308 (4), 351(3) (4) కింద కేసు నమోదు చేశారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో షారుఖ్ ఖాన్ ఇంటి వద్ద బందోబస్తు పెంచారు. షారుఖ్ కు రాయ్ పూర్ నుంచి బెదిరింపులు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సల్మాన్ ఖాన్ కు కూడా ఇలానే బెదిరింపులు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు ఆయనను బెదిరించారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 12న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మాజీ మంత్రి బాబా సిద్దిఖీని చంపారు. సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడైనందునే ఆయనను చంపారు.

4. కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం: దాడులు చేసుకున్న ఎమ్మెల్యేలు

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీ ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. 370 ఆర్టికల్ ను పునరుద్ధరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని బుధవారం ప్రవేశపెట్టారు. ఇదే విషయమై నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే బ్యానర్ ప్రదర్శించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చివరికి దాడులకు దారి తీసింది. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు.

5. ఓటమిని అంగీకరిస్తున్నా...కమలా హారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నానని కమలా హారిస్ చెప్పారు. వాషింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్శీటీ వేదికగా తన మద్దతుదారులనుద్దేశించి ఆమె మాట్లాడారు. ఇది ఆశించిన ఫలితం కాదు.. దీని కోసం పోరాడలేదన్నారు. అయినా, దీన్ని అంగీకరించాల్సిందేనని అమె అన్నారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.ఎప్పటికీ పోరుబాటను వీడనున్నారు.

6. ప్రశ్నిస్తే కేసులు: జగన్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు కేసులు, మద్యం మాఫియాపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా అరెస్టులు చేస్తున్నారని జగన్ చెప్పారు.

Tags:    

Similar News