Top 6 News @ 6PM: పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ కోర్టు నోటీసులు.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్

Update: 2024-10-21 12:39 GMT

1) Supreme Court: గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..

Supreme Court: గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియరైంది. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29 ని రద్దు చేయాలని కొందరు అభ్యర్ధులు ఈ నెల 19న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అక్టోబర్ 21న సుప్రీంకోర్టు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలని పిటిషన్ తరపు న్యాయవాదులు కోరారు. పరీక్షలు రాసే సమయంలో తాము ఈ పిటిషన్ పై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునకు కట్టుబడి ఉండాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) Hyderabad: బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం.. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని..

Student Suicide: బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష దసరా సెలవులకు వెళ్లి... తిరిగి హాస్టల్‌కు వచ్చి సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రులు దగ్గరుండి హాస్ట‌ల్‌లో వదిలి వెళ్లిన కాసేపటికే బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్‌లో వదిలి.. సిటీ దాటే లోపే అనూష స్పృహ కోల్పోయిందని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అయితే వారు కాలేజీకి వెళ్లే సరికి అనూష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా ఆమె తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది, బాచుపల్లి పోలీసులు అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

3) Chopper on Tirumala: తిరుమల కొండపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్: అధికారుల ఆరా

తిరుమల కొండపై సోమవారం ఉదయం హెలికాప్టర్ వెళ్లడం కలకలం రేపుతోంది. శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. కానీ తరచుగా తిరుమల కొండ మీదుగా విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే విషయాలపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. నో ఫ్లై జోన్‌గా ఉన్న తిరుమల కొండపై హెలికాప్టర్ ఎలా వెళ్లిందనే విషయమై అధికారులు ఏవియేషన్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఆగమశాస్త్ర నిబంధనల మేరకు తిరుమల కొండపై నుంచిహెలికాప్టర్ వెళ్లకూడదు. 2023 ఏప్రిల్ 25న తిరుమల కొండపై విమానం చక్కర్లు కొట్టింది. ఈ విమానం గురించి టీటీడీ అధికారులు ఆరా తీశారు. ఈ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానంగా అధికారులు చెప్పారు.

4) Weather Report: ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు.. దూసుకొస్తోన్న అల్పపీడనం. ఆ జిల్లాలకు డేంజర్ సిగ్నల్

21st October Weather Report: వాతావరణ శాఖ నుంచి మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. తూర్పు-మధ్య బంగాళాఖాతంపై ఒక అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా ప్రకటించింది. ఇది 22వ తేదీకి వాయుగుండంగా మారనున్నట్లు తెలిపింది. 23న తుఫాన్‌గా మారనుందని ప్రకటించింది. ఈ తుఫాన్ వాయవ్య దిశగా కదులుతూ.. 24 ఉదయం ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటుతుందని తెలిపింది. అలాగే, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకొని ఒక ఆవర్తనం ఉందని, దీంతో 21 నుంచి 25 వరకు కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) నవంబర్ 22న హాజరుకావాలి: పవన్ కళ్యాణ్‌కు హైద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు

పవన్ కళ్యాణ్ కు హైద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు సోమవారం సమన్లు పంపింది. ఈ ఏడాది నవంబర్ 22న వ్యక్తిగతంగా హజరు కావాలని ఆ నోటీసులో కోరింది. తిరుపతి లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలపై న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని పిటిషన్ చెప్పారు. ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా, యూట్యూబ్ నుంచి తొలగించాలని ఆయన కోరారు.ఈ పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారించింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌ పిటిషన్‌..

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో ప్రచారంలో పాల్గొన్న సమయంలో తనపై నమోదైన కేసు విషయంలో బన్నీ హైకోర్టును ఆశ్రయించారు. సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News