కేరళలో మరో ఇన్‌ఫెక్షన్‌ కలకలం.. 82 మంది చిన్నారులకు టమాటా ఫ్లూ..

Tomato Flu in Kerala: 82 మంది చిన్నారులకు టమాటా ఫ్లూ

Update: 2022-05-11 04:53 GMT

కేరళలో మరో ఇన్‌ఫెక్షన్‌ కలకలం

Tomato Flu in Kerala: దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చినా కేరళ మాత్రం వణికిపోతోంది. నిత్యం వందల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఇప్పుడు కేరళను టమాటా ఫ్లూ వణికిస్తోంది. చిన్నారులకు అధికంగా సోకుతున్న ఈ వ్యాధి ఇప్పుడు ప్రజల్లో కలవరం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా టమాటా ఫ్లూ కేసులు భయడపతున్నాయి. తమిళనాడు-కేరళ సరిహద్దులోని వాలయార్‌, కొల్లం ప్రాంతంలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో అటు కేరళ, ఇటు తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యేక వైద్య బృందాలను నియమించి చిన్నారులను పరీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు సోకకుండా వాహనాల్లో ప్రయాణించే ఐదేళ్ల లోపు చిన్నారులను వైద్యాధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీల్లోనూ ఐదేళ్లలోపు పిల్లలను తనిఖీ చేసేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.

కేరళలో ఇప్పటివరకు 82 మంది ఐదేళ్లలోపు చిన్నారులు టమాటా ఫ్లూ భారిన పడ్డారు. ప్రస్తుతం కొల్లం జిల్లాలో మాత్రమే ఈ కేసులు బయటపడ్డాయి. ఇక కేసుల సంఖ్య విషయానికొస్తే కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైనవి మాత్రమే ఇప్పటివరకు గుర్తించారు. ప్రవేటు ఆసుపత్రుల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయో ఇప్పటివరకు తెలియడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కేసులు కూడా కలుపుకుంటే బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. తమిళనాడు ప్రభుత్వం కూడా కోయంబత్తూరు జిల్లా కేరళ సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసింది. వ్యాధి ప్రబలకుండా టమాటా ఫ్లూ బాధితులను అక్కడే గుర్తించి అవసరమైన చికిత్సకు రెఫర్‌ చేస్తున్నారు.

అసలు టమాటా ఫ్లూ అనేది మన దేశంలో ఓ సాధారణ రకమైన వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌. ఈ వ్యాధి ఐదేళ్లలోపు పిల్లలకే సోకుతుంది. వారికి తీవ్ర జ్వరంతో పాటు దద్దుర్లు, చర్మం చికాకుగా మారడం, నిర్జలీకరణ వంటి లక్షణాలు ఉంటాయి. ఫ్లూ సోకిన పిల్లల్లో శరీరంపై బొబ్బలు వస్తాయి. ఇవి సాధారణంగా టమాటా రంగులో ఉంటాయి. అందుకే టమాటా ఫ్లూ లేదా టమాటా జ్వరం అంటారు. అయితే నివారణ చర్యలు తీసుకోకపోతే.. ఇతర ప్రాంతాలకు కూడా ఈ వ్యాధి వ్యాప్తించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి నివారణకు చర్చలు తీసుకుంటున్నారు. లక్షణాలున్న చిన్నారులను వెంటేనే సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ టమాటా ఫ్లూను అడ్డుకునేందుకు చర్చలు తీసుకుంటున్నారు. 

Full View


Tags:    

Similar News