Petrol Diesel Price Today: పెట్రోల్ ధరల్లో సెంచరీ కొట్టనున్న తెలుగు రాష్ట్రాలు

Petrol Diesel Price Today: దేశవ్యాప్తంగా చిన్న పాటి మార్పులు కనిపిస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ వైపు పెట్రోల్ ధరలు

Update: 2021-05-23 02:45 GMT

Petrol Diesel Price Today:(The Hans India)

Petrol Diesel Price Today: వ‌రుస‌గా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌లేదు. అయితే ఇది కేవ‌లం దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కే ప‌రిమిత‌మ‌ని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెట్రోల్‌, డీజిల్ ధరలు సెంచరీ వైపు అడుగులు వేస్తోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ‌రాజ‌ధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 92.85 ఉండ‌గా..డీజిల్ ధ‌ర‌ల‌లోనూ మార్పులు లేవు ఇక్కడ లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 83.51 వ‌ద్ద కొన‌సాగుతోంది. ముంబ‌యిలోనూ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు క‌నిపించ‌లేదు. ఇక్‌‌డ శుక్ర‌వారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 99.14లు ఉండ‌గా, డీజిల్ రూ. 90.71లు ఉంది. చెన్నైలో స్వ‌ల్ప మార్పు క‌నిపించింది ఇక్క‌డ‌ శుక్ర‌వారం లీట‌ర్ పెట్రోల్ రూ. 94.64 గా న‌మోదుకాగా.. డీజిల్ రూ. 88.43 వ‌ద్ద కొన‌సాగుతోంది. బెంగ‌ళూరులోనూ ఇంధ‌న ధ‌ర‌ల్లో మార్పులు క‌నిపించ‌లేవు. ఇక్క‌డ లీట‌ర్ పెట్రోల్ రూ.95.94 గా ఉండ‌గా డీజిల్ ధ‌ర రూ. 88.53 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో …

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.70 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 96.31గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.03 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.91.65 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 97.67గా ఉండగా.. డీజిల్ ధర రూ. 91.24గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.17గా ఉండగా.. డీజిల్ ధర రూ.91.77గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.21ఉండగా.. డీజిల్ ధర రూ.91.83 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.25పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.93గా ఉంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 99.53కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.60 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 98.62ఉండగా.. డీజిల్ ధర రూ.92.69గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.62లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.92.78 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.20 గా ఉండగా.. డీజిల్ ధర రూ.93.16గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 99.53లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.93.60 లకు లభిస్తోంది.

Tags:    

Similar News