Bank Bandh: ఇవాళ, రేపు బ్యాంకులు బంద్
Bank Bandh: ఉద్యోగుల సమ్మెతో నిలిచిపోనున్న బ్యాంక్ సేవలు * ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన
Bank Bandh: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఇవాళ, రేపు సమ్మెకు దిగనున్నారు. ఉద్యోగుల సమ్మెతో బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో 9 యూనియన్లు ఉన్నాయి. సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు.
ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ఐడీబీఐ సహా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. దాంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు.. దీంతో ఈ రెండు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగనుంది. ప్రైవేటీకరణను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకు ముందు అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో కేంద్ర ప్రభుత్వంతో పలు విడతలుగా చర్చలు జరిగాయి. మార్చి 4, 9, 10 తేదీల్లో జరిగిన రాజీ చర్చలు సానుకూల ఫలితం రాకపోవడంతో.. సమ్మె అనివార్యంగా మారినట్టు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది.