ఈరోజు అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ డిశ్చార్జ్
* శశికళకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం-వైద్యులు * ఫిబ్రవరి మొదటి వారంలో చెన్నైకు శశికళ * శశికళ రాజకీయ జీవితంపై కొనసాగుతున్న ఉత్కంఠ
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఈరోజు విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడినప్పటికీ మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే డాక్టర్ల సూచన మేరకు శశికళ బెంగుళూరులోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో శశికళ చెన్నై వెళ్తారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే శశికళ రాజకీయ జీవితంపై ఉత్కంఠ నెలకొంది. 2021 మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో చిన్నమ్మ రీ ఎంట్రీ ఉంటుందా? లేదా? అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. మరి ఆమె నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతుందో చూడాలి మరీ.