ఎన్నికల వేళ బెంగాల్‌లో మమతాబెనర్జీకి మరో షాక్
బీజేపీ చేరిన సువేందు అధికారి సోదరుడు సౌమేందు
ఎన్నికలకు ఆరు నెలల ముందే బెంగాల్‌లో పొలిటికల్ దంగల్ పీక్స్‌కు చేరుతోంది. ఎన్నికల వేళ టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీకి మరో షాక్ తగిలింది. ఈమధ్య మాజీ మంత్రి సువేందు అధికారి సహా పలువురు తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీ చేరగా... ఇప్పుడు సువేందు తమ్ముడు కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాంటాయ్ మున్సిపాలిటీకి చెందిన 15మంది కౌన్సిలర్లు కూడా కాషాయం జెండా కప్పుకున్నారు. అధికారి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు నేతలు మాత్రమే ఇప్పుడు టీఎంసీలో ఉన్నారు.
కాంటై మున్సిపాలిటీ నిర్వాహకుడిగా ఉన్న సౌమేందును ఈ మధ్యే తొలగించారు. ఐతే ఈవ్యవహారాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారాయన. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసిన బీజేపీ.. ఒక్కొక్కరిని కమలం పార్టీలోకి లాగుతోంది. సువేందు అధికారితో పాటు ఆరుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కమలతీర్థం పుచ్చుకోగా.. ఆ కుటుంబం నుంచి మరొకరు కూడా కాషాయం కండువా కప్పుకోవడం.. రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.