New Delhi: ఢిల్లీలో టిబెట్ యువత ఆందోళనలు
New Delhi: టిబెట్‌కు విముక్తి కల్పించాలని... ఢిలీలో చైనా ఎంబసీ ఎదుట నిరసన ప్రదర్శన
New Delhi: చైనా జాతీయ దినోత్సవానికి వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెట్ యువత ఆందోళనలను చేశారు. బీజింగ్ ఆధ్వర్యంలోని టిబెట్‌కు స్వాతంత్రం కల్పించాలని డిమాండ చేస్తూ.. చైనా రాయబార కార్యాలయం ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు. ఇటీవల టిబెట్‌లో సామూహిక డీఎన్‌ఏ సేకరణ చైనా చేపడుతోంది. దానిపైనా టిబెట్ యువత విమర్శలు గుప్పించారు. సామూహిక డీఎన్‌ఏ సేకరణను నిలిపేయాలంటూ డిమాండ్ చేశారు. టిబెట్‌లో పలువురు హత్యలకు గురవుతున్నారని.. ఇవన్నీ చైనా చేస్తున్నవేనని ఆరోపించారు. టిబెట్ విముక్తికి భారత్ సహకరించాలని చైనాను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చైనా రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న టిబెట్ యువతను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టిబెట్‌కు చైనా నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేశారు. 1949 అక్టోబరు 1న మావో జెడాంగ్ ఆధ్వర్యంలో పీపుల్స్ రిబ్లిక్ ఆఫ్ చైనాగా అవతరించింది. తియాన్మెన్ స్క్వేర్‌లో కమ్యూనిస్టు జెండా ఎగిరింది. అక్టోబరు నుంచి మావో జెడాంగ్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటయింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 1న చైనా జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నారు.