ఈ టాప్‌ బ్యాంకులు FDపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నాయి.. ఎంతంటే..?

*టాప్ బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. కొత్త వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

Update: 2021-12-29 08:30 GMT

Fixed Deposits: భవిష్యత్‌లో మంచి రాబడి సంపాదించాలనుకునేవారు ఎక్కువగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తారు. అది కూడా ఎక్కడ ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారో అక్కడే డిపాజిట్‌ చేస్తారు. అయితే కరోనా వల్ల చాలా బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు వడ్డీరేట్లను తగ్గించాయి. దీంతో సాధారణ ప్రజలు బ్యాంకులు ఎఫ్డీలపై ఎప్పుడు వడ్డీ రేట్లను పెంచుతాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని రకాల టాప్ బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. కొత్త వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

ఒక సంవత్సరం కంటే తక్కువ

6 నెలల నుంచి ఏడాది మధ్య కాలంలో యెస్ బ్యాంక్ బెస్ట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ సారి బ్యాంక్ 5 నుంచి 5.25 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. అదే సమయంలో DCB బ్యాంక్, RBL బ్యాంక్, కర్ణాటక బ్యాంకులు 5 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ఈ కాలానికి వడ్డీ రేటు పరిధి 3.5 శాతం నుంచి ప్రారంభమవుతుంది. పెద్ద బ్యాంకుల్లో ఎస్‌బీఐ 4.4 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.5 శాతం నుంచి 4.4 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్య వడ్డీ రేట్లు

2 సంవత్సరాల కంటే తక్కువ, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి 6 శాతం అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్ ఈ కాలానికి 6 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ కాలానికి చాలా బ్యాంకులు 5 శాతానికి పైగా వడ్డీని ఇస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ 5.10 నుంచి 5.25 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 4.9 నుంచి 5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.

2 నుంచి 5 సంవత్సరాల మధ్య వడ్డీ రేట్లు

బ్యాంకులు 2 నుంచి 3 సంవత్సరాలకు అందించే FD రేట్లు 5.25 శాతం నుంచి 6 శాతం వరకు ఉంటాయి. యస్ బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 6 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. అదే సమయంలో 3 నుంచి 5 సంవత్సరాల కాలానికి 5.25 శాతం నుంచి 6.25 శాతం వరకు ఉంటాయి. ఈ విభాగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.3 శాతం వడ్డీని ఇస్తోంది.

5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం పాటు

ఐదేళ్ల పైబడిన కాలవ్యవధిలో యెస్ బ్యాంక్ 6.25 శాతం, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ 6 శాతం, డిసిబి బ్యాంక్ 5.95 శాతం, ఆర్‌బిఎల్ బ్యాంక్ 5.75 నుంచి 6.3 శాతం, యాక్సిస్ బ్యాంక్ 5.75 శాతం, ఫెడరల్ బ్యాంక్ 5.6 శాతం, కరూర్ వైశ్యా బ్యాంక్ 5.6 నుంచి 5.75 శాతం, సౌత్ ఇండియన్ బ్యాంక్ 5.5 నుంచి 5.65 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 6 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.4 శాతం, యూనియన్ బ్యాంక్ 5.5 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 5.6 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.

Tags:    

Similar News