Delhi: జహింగీర్‌పురిలో అక్రమకట్టడాలపై కొరడా

Delhi: జహింగీర్‌పురిలో ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు స్టే

Update: 2022-04-20 06:53 GMT

Delhi: జహింగీర్‌పురిలో అక్రమకట్టడాలపై కొరడా

Delhi: ఉత్తర ఢిల్లీలోని జహింగీర్‌పురిలో ఆక్రమణల తొలగింపుపై వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఆక్రమణల తొలగింపును ఆపేయాలంటూ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై రేపు విచారణ చేపడుతామని అప్పటివరకు ఆక్రమణల విషయంలో యథాస్థితిని కొనసాగించాలని ఢిల్లీ మున్సిపల్‌ అధికారులను సుప్రీం ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆక్రమణలు కూడా తొలగించకూడదని ఆదేశించింది. హనుమాన్‌ జయంతి వేడుకల్లో హింసకు కారణమైన ఉత్తర ఢిల్లీలోని జహింగీర్‌పురిలో భారీగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించుకున్నట్టు మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం అక్రమ కట్టడాలను కూల్చివేతకు జహింగీర్‌పురికీ బుల్డోజర్లుతో సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చారు.

ఉదయం 9 గంటల నుంచి ఆక్రమణలపై నార్త్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌-ఎన్‌డీఎంసీ కొరఢా ఝులిపించింది. 400 మంది మున్సిపల్‌ సిబ్బంది ఆధ్వర్యంలో ఆక్రమణలకు భారీగా బుల్డోజర్లతో కూల్చివేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా వందలాది మంది పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించారు. మరోవైపు కూల్చివేసిన శిథిలాలను ట్రక్కుల్లో మున్సిపల్‌ సబ్బంది తరలించారు. అయితే కూల్చివేతల సందర్భంగా పులువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్నట్టుండి ఇళ్లను కూల్చివేయడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గూడు చూపాలని కోరుతున్నారు. మరోవైపు సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా కూల్చివేతలు మాత్రం కొనసాగుతున్నాయి.

హనుమాన్‌ జయంతి వేడుకల్లో జహింగీర్‌పురిలో ఇరు వర్గాల మధ్య భారీ హింస చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇరువర్గాలకు చెందిన 23 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఐదుగురి నుంచి ఐదు తుపాకీలు, ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల విచారణకు వచ్చిన పోలీసు అధికారులపైనా రాళ్ల దాడికి దిగారు. అయితే ఘర్షణల తరువాత ఈ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చున్నారు. డ్రోన్‌లతో నిఘా పెడుతూ భద్రతను పర్యవేషించారు. మరోవైపు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ శాంతి కమిటీతో చర్చలు జరుపుతున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పరిస్థితులు అదుపులో ఉన్నాయని దర్యాప్తు న్యాయమైన రీతిలో జరుగుతుందని ఢిల్లీ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసు కమిషనర్‌ దేవేంద్ర పాఠక్‌ తెలిపారు.

Full View


Tags:    

Similar News