అట్టుడికిన దేశ రాజధాని ఢిల్లీ

* రణరంగంగా మారిన కిసాన్ పరేడ్ ర్యాలీ * పోలీసులను దాటుకుని ముందుకు పోయిన రైతులు * ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగిరిన పరాయి జెండా

Update: 2021-01-27 05:46 GMT

Delhi farmers 

దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికింది. గణతంత్ర దినోత్సవం రోజున అన్నదాతలు తలపెట్టిన కిసాన్ పరేడ్ దేశ రాజధానిని రణరంగంగా మార్చింది శాంతియుతంగా నిర్వహించాలని భావించిన రైతుల రణతంత్ర పరేడ్ హింసాత్మకంగా రూపుదాల్చింది. ఉదయం నుంచి రాత్రి వరకూ ఢిల్లీ అంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు రాజ్యమేలాయి. రైతులను అడ్డుకునే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తే బారికేడ్లు దాటుకుని ముందుకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు ఈ ప్రయత్నంలో ఘర్షణాలు జరిగాయి. పలువురికి గాయాలు అయ్యాయి. ఒక రైతు చనిపోయారు పోలీసులు, రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

మరోవైపు కిసాన్ పరేడ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలను రైతు సంఘాలు ఖండించాయి. దీంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశాయి. పరేడ్‌లో జరిగిన హింసా విధ్వంసాలకు తాను సిగ్గుపడుతున్నానని, ఇందుకు తాను వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తున్నానని స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ అన్నారు. హింసతో మేం విజయం సాధించలేమని తెలిపారు. ఢిల్లీలోనే ఉన్న రైతులంతా తిరిగి సరిహద్దు పాయింట్లు వద్దకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్కడే నిరసన తెలిపేందుకు సహకరించాలని కోరారు.

ఢిల్లీలో జరిగిన ఘటనలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిఘా వర్గాలతో సమావేశం అయి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. రాజధానిలో అదనంగా పారా మిలటరీ బలగాలను భారీగా మోహరించాలని నిర్ణయించారు. రాష్ట్రపతి, పార్లమెంట్, ప్రధాని నివాసాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ నిలపేశారు. హరి‍యాణా సోనిపట్, మరో 3 జిల్లాల్లో ఇంటర్ నెట్ నిలిపేశారు.

ఢిల్లీలోనే ఇంకా వేల మంది రైతులు ఉండడంతో కేంద్రం అత్యవసరంగా 15 కంపెనీల పారామిలటరీ బలగాలను కీలక ప్రదేశాల దగ్గర మోహరించింది. రైతులను తిరిగి సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ ప్రాంతాలకు పంపేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఫిబ్రవరి 1 నుంచి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆందోళనలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తిగా మారింది. రైతులు తమ ట్రాక్టర్లతో రామ్‌లీలా మైదానానికి చేరుకోవడంతో ఆందోళనలకు తాత్కలికంగా ఆగాయి.

Full View


Tags:    

Similar News