Chalo Delhi: రైతుల ఆందోళన మళ్లీ షురూ.. నేడు ఢిల్లీ చలో మార్చ్
Chalo Delhi: నగరంలో వాహనాల తనిఖీలు చేపట్టిన ఢిల్లీ పోలీసులు
Chalo Delhi: డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు మరోసారి ఢిల్లీ చలోకు సిద్ధమయ్యాయి. ఇవాళ ఢిల్లీలో నిరసనలు చేపట్టాలని మార్చి 3న రైతు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఇటీవల రైతుల ఢిల్లీ చలో కార్యక్రమాన్ని పంజాబ్, హర్యానా బోర్డర్‌లోనే అడ్డుకున్నారు పోలీసులు. ట్రాక్టర్లతో రాజధాని నగరానికి చేరుకుంటున్న రైతుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. దీంతో ఈసారి ప్రజా రవాణా వినియోగించుకోవాలని తెలిపాయి రైతు సంఘాలు.
ఆందోళనకు వచ్చే రైతులు బస్సులు, రైళ్లలో ఢిల్లీకి రావాలన్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. నగరమంతా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నగరంలో వాహనాల రాకపోకలపై నిఘా పెంచారు. దీంతో పాటు రాజధానిలోని అన్ని మెట్రో స్టేషన్లను కూడా పర్యవేక్షిస్తున్నారు.