Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు

Arvind Kejriwal: ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన ఈడీ

Update: 2024-06-21 10:01 GMT

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై సస్పెన్స్ నెలకొంది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్‌‌కు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేసింది. దాంతో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్‌ ఆర్డర్‌పై స్టే విధించింది ఢిల్లీ హైకోర్టు.

ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్‌ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న నిన్న ఈడీ అభ్యర్థించగా... జడ్జి తిరస్కరించారు.లక్ష వ్యక్తిగత బాండ్‌ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. దర్యాప్తును అడ్డుకోకూడదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని షరతులు విధించారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆర్డర్స్ ప్రకారం తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ ఇవాళ సాయంత్రం బెయిల్‌పై బయటకు రావాల్సి ఉంది. అయితే హైకోర్టు బెయిల్‌పై స్టే విధించడంతో సందిగ్ధత నెలకొంది.

Tags:    

Similar News