Diesel Vehicles: జనవరి 1 నుంచి 10 ఏళ్ల డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దు..!

Diesel Vehicles: కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం పదేళ్లు దాటిన డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేయనుంది

Update: 2021-12-18 06:34 GMT

 జనవరి 1 నుంచి 10 ఏళ్ల డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు..!(ఫైల్-ఫోటో)

Diesel Vehicles: కాలుష్యం కారణం వల్ల ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదేళ్లు దాటిన డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేయనుంది. ఆ వాహనాలను స్క్రాప్‌కి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్‌ ప్రజల ఆరోగ్యాలను దెబ్బ తీస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

జనవరి 1, 2022 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అన్ని డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలనుకునే కారు యజమానులకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి) జారీ చేయరు. తద్వారా వాహనాల రీ-రిజిస్ట్రేషన్ మరెక్కడా జరుగదు.

NGT ఆదేశం ప్రకారం ఢిల్లీ-NCR లో 10 ఏళ్ల డీజిల్, 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలను నడపడంపై నిషేధం ఉంది. అయితే అలాంటి వారికి ఒక వెసులుబాటు కల్పించింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో 10 ఏళ్ల డీజిల్, 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చి నడపవచ్చని పేర్కొంది.

కానీ ప్రభుత్వం గుర్తించిన రెట్రోఫిటెడ్ కంపెనీల నుంచి మాత్రమే కిట్‌ను అమర్చాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లో తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాహనాలను స్క్రాప్ విధానం ప్రకారం రద్దు చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఢిల్లీ రవాణా శాఖ వాహనాలను స్క్రాప్ చేయగల అధీకృత స్క్రాపర్‌ల జాబితాను రూపొందించింది.

ఈ ఆదేశాలను పాటించని వాహన యజమానుల వాహనాలను జప్తు చేయడంతోపాటు మోటారు వాహన చట్టం, 1988 ప్రకారం శిక్షార్హమైన చర్యలు తీసుకుంటారు. ఈ విషయంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ వాహనం 20 ఏళ్ల తర్వాత, కమర్షియల్ వాహనం 15 ఏళ్ల తర్వాత ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవాలని స్పష్టంగా పేర్కొంది.

ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వాహనాలకు భారీ జరిమానా విధిస్తారు. అలాగే అలాంటి వాహనాలను జప్తు చేస్తారు. ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వాహనాలను నడపడానికి అనుమతిస్తారు. స్క్రాపేజ్ విధానంలో ఫిట్‌నెస్ లేని వాహనాలు తుక్కు చేస్తారు.

Tags:    

Similar News