భారత్‌లో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని జరుగుతున్న ఆందోళనలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి కొత్త వ్యవసాయ చట్టాలకు యూఎస్ మద్ధతు పలికింది. ఈ సంస్కరణలు మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని బైడెన్ పాలనాయంత్రాంగం స్పష్టం చేసింది. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చట్టాల విషయంలో అభిప్రాయభేదాలు చర్చల ద్వారా పరిష్కరించబడడాన్ని తాము ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది. భారతదేశ మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచే మరియు మరిన్ని ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించే చర్చలను యూఎస్ స్వాగతిస్తుందన్నారు.