దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతం
* తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
Mandous Cyclone: దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం తుఫాన్ గా మారి తీరం వైపు దూసుకొస్తోంది. మండూస్ తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. తీరప్రాంతంలోని 12 మండలాల్లో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాను తీవ్రతను గుర్తిస్తూ వాతావరణశాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కలెక్టర్ అన్ని మండల స్థాయి అధికారులతో.. డివిజన్ స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులందరికీ సెలవులు రద్దు చేశారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండూస్ తుఫాను నెల్లూరు జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం... తాజా పరిస్థితిపై మా నెల్లూరు జిల్లా ప్రతినిధి నరసింహులు మరింత సమాచారం అందిస్తారు.