India: కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కిన భారత్
India: కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.
India: కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. రెండు త్రైమాసికాల క్షీణతతో ఏర్పడిన సాంకేతిక మాంద్యం నుంచి బయటపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు త్రైమాసికాల్లో భారీగా పతనమైన జీడీపీ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధి చెందినట్లు జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించింది. నిర్మాణ, వ్యవసాయ, తయారీ, సేవా రంగాలు మంచి ప్రదర్శన కనబర్చడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7 శాతం మేర క్షీణిస్తుందని అంచనా వేసిన ఎన్‌ఎస్‌ఓ.. తాజాగా విడుదల చేసిన అంచనాల్లో 8 శాతం మేర డీలా పడుతుందని తెలిపింది.