UAN: ఇంట్లో కూర్చొనే PF ఖాతాలో బ్యాంక్ అకౌంట్‌ అప్‌డేట్‌ చేయొచ్చు.. ఎలాగంటే..?

UAN: ఇంట్లో కూర్చొనే PF ఖాతాలో బ్యాంక్ అకౌంట్‌ అప్‌డేట్‌ చేయొచ్చు.. ఎలాగంటే..?

Update: 2022-01-08 14:30 GMT

ఇంట్లో కూర్చొనే PF ఖాతాలో బ్యాంక్ అకౌంట్‌ అప్‌డేట్‌ చేయొచ్చు.. ఎలాగంటే..?

UAN: EPFలో మీ బ్యాంక్ వివరాలను సులభంగా అప్‌డేట్ చేయవచ్చు అంతేకాదు మార్చుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఖాతాదారులు ఈ సేవను ఉపయోగించడానికి యూనివర్సల్ ఖాతా సంఖ్య ( UAN ) తప్పనిసరిగా ఉండాలి. UAN ఉపయోగించి మీ PF ఖాతాదారులు వారి పెన్షన్ ఫండ్ వివరాలను యాక్సెస్ చేయవచ్చు. PF ఖాతాకు సంబంధించి మీ అన్ని లావాదేవీలను ట్రాక్ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు వారు ఖాతాతో అనుసానిందించిన బ్యాంక్ వివరాలను కూడా అప్‌డేట్ చేయవచ్చు. EPFOని సందర్శించకుండానే PF ఖాతాదారుల అన్ని అవసరాలకు UAN ద్వారా ఇంట్లో నుంచే చేయవచ్చు.

ఎలా అప్లై చేయాలంటే..?

1. 'యూనిఫైడ్ మెంబర్ పోర్టల్'కి వెళ్లండి. 'UAN పాస్‌వర్డ్'తో లాగిన్‌కండి.

2. 'మేనేజ్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెను నుంచి 'KYC' ఎంపికను ఎంచుకోండి

3. డాక్యుమెంట్‌ ఎంచుకోండి. 'బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్'ని నమోదు చేయాలి. 'సేవ్' క్లిక్ చేయాలి.

4. కొత్త బ్యాంక్ వివరాలను సేవ్ చేసిన తర్వాత 'అప్రూవల్ కోసం KYC పెండింగ్' కనిపిస్తుంది. యజమానికి డాక్యుమెంట్‌ చూపించు. వీటిని యజమాని ధృవీకరించిన తర్వాత 'అప్రూవల్ కోసం పెండింగ్‌లో ఉన్న KYC' 'డిజిటల్ ఆమోదించబడిన KYC'కి మారుతుంది. యజమాని బ్యాంక్ వివరాలను విజయవంతంగా ధృవీకరించిన తర్వాత సభ్యుడు EPFO ​​నుంచి నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు.

E-నామినేషన్‌ వెంటనే చేయండి

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సభ్యులకు ఈ-నామినేషన్ ద్వారా నామినీలను చేర్చుకునే సదుపాయాన్ని కల్పించింది. ఖాతాదారుడు మరణించిన తర్వాత నామినీకి ఈ-నామినేషన్ ప్రయోజనం అందుతుంది. ఖాతాదారుడి పీఎఫ్, పెన్షన్, బీమా సొమ్మును పొందడం సులభం. PF ఖాతాదారులు ఒకరి కంటే ఎక్కువ మంది నామినీల పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని EPFO ​​అందిస్తుంది

Tags:    

Similar News