D614G: మరో ముప్పు.. కరోనా కంటే చాలా ఖ‌త‌‌ర్నాక్ వైర‌స్‌

D614G: ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాలు కరోనా మ‌హ‌మ్మారితో అల్లాడిపోతుంటే.. దానికి కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన మరొక వైర‌స్ బైటపడింది. ఇది కూడా క‌రోనా వైర‌స్ ఉత్పరివర్తనమేన‌నీ, దీనికి 'డి614జి(D614G) గా నామకరణం చేశారు.

Update: 2020-08-30 15:41 GMT

D614G: more dangerous coronavirus mutation detected in indonesia

D614G: ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాలు కరోనా మ‌హ‌మ్మారితో అల్లాడిపోతుంటే.. దానికి కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన మరొక వైర‌స్ బైటపడింది. ఇది కూడా క‌రోనా వైర‌స్ ఉత్పరివర్తనమేన‌నీ, దీనికి  'డి614జి(D614G) గా నామకరణం చేశారు. తాజాగా ఈ వైర‌స్ ఇండోనేసియాలో బైటపడింది. కరోనా వైరస్ తో పోల్చి చూస్తే ఇది ప‌ది రెట్లు బలవంతమైనదనీ, ప్రమాదకరమైనదని తెలుస్తోంది. ఈ వైరస్‌కు అత్యంత వేగంతో వ్యాప్తించే గుణం ఉందట.  ఈ వైర‌స్ పై జకర్తాలోని ఐజాక్‌మాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మాలిక్యూలర్‌ బయాలజీ అధ్యయనం చేస్తుంది.

ఇప్పటివరకూ ప్రపంచంలో డి614జి వైరస్ ఒక క్లస్టర్‌లోని 45 కేసుల్లో కనీసం మూడు కేసులలో గుర్తించారు. తాజాగా ఫిలిప్పీన్స్ నుంచి తిరిగొచ్చిన వ్యక్తులతో కూడిన క్లస్టర్‌లో ఈ కొత్త రకం వైరస్‌ను గుర్తించినట్టు మలేసియా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంకా.. భారత్ నుంచి తిరిగొచ్చిన ఓ రెస్టారెంట్ యజమానిలోనూ ఈ తరహా వైరస్ గుర్తించామన్నారు. ఈ వైరస్‌ను ఇండోనేషియాలో గుర్తించినట్లు జకర్తాలోని ఐజాక్‌మాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మాలిక్యూలర్‌ బయాలజీ వెల్లడించింది. ఇప్పటికే ఇండోనేషియాలో D614G వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెంది ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ఈ వైరస్‌ను‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఫిబ్రవరి నెలలోనే గుర్తించింది. దీని మ్యుటేషన్ ఐరోపా, అమెరికాలో వైవిధ్యంగా ఉందని.. ఈ జాతి మరింత తీవ్రమైన వ్యాధికి దారితీస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.

అలాగే, ఇండోనేసియాలో 1,72,000 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 7300మంది మరణించారు. ఇండోనేసియాలో ప్రస్తుతం కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. 'డి614జి' ఉత్పరివర్తనం వల్ల కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. ఇదే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా 5లక్ష మందికి కరోనా వ్యాపించే అవకాశముంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇండోనేసియా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  

Tags:    

Similar News