TOP 6 NEWS @ 6PM: ఏపీ అభివృద్ధి కోసం బిల్ గేట్స్‌తో కలిసి చంద్రబాబు కొత్త ప్లాన్

Update: 2025-03-19 12:36 GMT
Telangana Budget 2025, Sunita Williams, Chandrababu Naidu, Bill Gates, AP News

మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

  • whatsapp icon

1) Telangana Budget 2025-26: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్.. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి

Telangana Budget 2025-26: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.2025-26 ఆర్ధిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. రెవిన్యూ వ్యయం రూ.2,26, 982 కోట్లు, మూలధన వ్యయం రూ.6,504 కోట్లుగా ప్రతిపాదించారు. గత ఏడాది రూ.2.9 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి జీఎస్‌డీపీ రూ. 16, 1,579 కోట్లు.

గత ఏడాదితో పోలిస్తే వృద్ధి రేటు10.1 శాతంగా నమోదైందని ప్రభుత్వం ప్రకటించింది. ఇదేసమయంలో భారత దేశ జీడీపీ రూ. 3, 31,03,215 కోట్లు. వృద్ది రేటు 9.9 శాతంగా నమోదైంది.2024-25 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 గా ఉది. వృద్ధి రేటు 9 శాతం, దేశ తలసరి ఆదాయం రూ.2,05, 579 గా ఉంది. వృద్ధి రేటు 8.8 శాతంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) Telangana Budget 2025: సన్న వడ్లకు రూ. 500 బోనస్... రైతుల ఖాతాల్లో 1,206.44 కోట్లు జమ

Telangana Budget 2025 allotments towards Agriculture : రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సన్న వడ్లు పండించే రైతులకు ప్రతి క్వింటాలుకు రూ. 500 బోనస్ కూడా ఒకటి. తాజాగా తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ సన్న వడ్లకు బోనస్ చెల్లింపు వివరాలను వెల్లడించారు.

సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ చెల్లించడం వల్ల గత ఖరీఫ్‌తో పోల్చితే ఈసారి సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో సన్న వడ్లు పండించిన రైతుల ఖాతాల్లో రూ. 1206.44 కోట్ల రూపాయలు జమ చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 8,332 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. 40 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో చర్చకొచ్చిన అంశాలను చంద్రబాబు ఎక్స్ ద్వారా అందరితో పంచుకున్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ పరిజ్ఞానం ఉపయోగం గురించి చర్చించినట్లు చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ కలిసి పని చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

4) సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు

Sunita Williams's career journey highligts: విధి ఎవరిని ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదు అని అంటుంటారు కదా... భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ విషయంలోనూ ఎగ్జాట్ల్‌లీ అదే జరిగింది. ఆమె చిన్నప్పుడు పెట్టుకున్న లక్ష్యానికి, పెరిగి పెద్దయ్యాక ఆమె ఎంచుకున్న రంగానికి, సాధించిన ఘన విజయాలకు అసలు సంబంధమే లేదు.

ఆమె నాసాలోకి ఎలా అడుగుపెట్టారు? అంతకంటే ముందు ఏం జరిగింది? డెస్టినీ ఆమెను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లిందనే వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) భూమి మీదకు సునీతా: వ్యోమనౌకను హీట్ షీల్డ్ ఎలా కాపాడుతాయి, వేగం ఎలా నియంత్రిస్తారు?

సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చారు. సురక్షితంగా స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు దిగడానికి నాసా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అత్యంత వేగంతో పాటు ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునేలా వ్యోమనౌకకు పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది.

అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా వ్యోమనౌక డిజైన్ వ్యోమ నౌకలు అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చే సమయంలో 24 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ వ్యోమనౌక అంత వేగంతో ప్రయాణించే సమయంలో ఆ వేగాన్ని తగ్గిస్తారు. ఇందుకు తగ్గట్టు వ్యోమనౌకలో రెండు డ్రోగ్ చూట్లు ఉంటాయి. ఈ డ్రోగ్ చూట్లు వ్యోమనౌక వేగాన్ని నియంత్రిస్తాయి. వ్యోమనౌక భూ వాతావరణంలో ప్రవేశించే సమయంలో విపరీతమైన వేడి పుడుతుంది. 7 వేల డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత ఉద్భవిస్తుంది. ఈ ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు వ్యోమనౌక చుట్టూ ఉష్ణకవచం ఏర్పాటు చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) కెనడా వచ్చి తప్పు చేశాను... పెద్ద చర్చకు దారితీసిన సోషల్ మీడియా పోస్ట్

Indian students in Canada: మీలో ఎవరైనా కెనడాకు వస్తున్నారా? లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కెనడాలో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఇది మీ కోసమే అంటున్నారు ఆల్రెడీ కెనడాలో చదువుకుంటున్న ఒక ఇండియన్ స్టూడెంట్. కెనడాకు వచ్చి తప్పు చేశానని బాధపడుతున్నట్లుగా ఆ స్టూడెంట్ రెడిట్ ద్వారా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్టులో ఆ ఇండియన్ స్టూడెంట్ ఏమేం వివరాలు వెల్లడించారు? ఎందుకు ఆ పోస్ట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

విదేశాల్లో భవిష్యత్ బాగుంటుందని కెనడాకు వచ్చాను. ఒకవేళ మీరు కూడా అలాంటి కలలు కంటూ పాశ్చాత్య దేశాలకు రావాలనుకుంటే అది ఒక భ్రమే అవుతుంది కానీ అందులో నిజం లేదని ఆ స్టూడెంట్ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News