రేషన్ కార్డు పాపులారిటీ కార్డుగా మారాయి: సుప్రీంకోర్టు
రేషన్ కార్డు పాపులారిటీ కార్డుగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బుధవారం నాడు రేషన్ కార్డులపై ఉన్నత న్యాయస్థానం విచారించింది.

రేషన్ కార్డు పాపులారిటీ కార్డుగా మారాయి: సుప్రీంకోర్టు
రేషన్ కార్డు పాపులారిటీ కార్డుగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బుధవారం నాడు రేషన్ కార్డులపై ఉన్నత న్యాయస్థానం విచారించింది. అర్హులకు రేషన్ కార్డులు అందడంలేదని కోర్టు అభిప్రాయపడింది. అనర్హులకు అధికంగా బీపీఎల్ ప్రయోజనాలు అందుతున్నాయని కోర్టు తెలిపింది. తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పే రాష్ట్రాలు కూడా బీపీఎల్ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయని ఉన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తు చేసింది. పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకొనేందుకే రాష్ట్రాలు రేషన్ కార్డుల లెక్కలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిజానికి పేదలకు రేషన్ ఫలాలు అందడం లేదని కోర్టు తెలిపింది.
పేదలను గుర్తించకుండా, వర్గీకరించడానికి రాష్ట్రాలు శాస్త్రీయ పద్దతులను అనుసరిస్తున్నాయా అని కోర్టు ప్రశ్నించింది. వలస కార్మికులు, నైపుణ్యం లేని కార్మికులకు ఈ శ్రామ్ పోర్టల్ కింద అర్హులుగా గుర్తించి ఉచిత రేషన్ కార్డుల జారీని కోర్టు విచారిస్తోంది.2021 జనాభా లెక్కలు జరగనందున రేషన్ కార్డుకు అర్హులైన సుమారు 10 కోట్ల మంది ఉన్నారని వారికి ఆహార కోటాతో సంబంధం లేకుండా ఉచిత సబ్సిడీ రేషన్లు ఇవ్వాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు.
2024 అక్టోబర్ 4న, సుధాన్షు ధులియా , అమానుల్లాలతో కూడిన ధర్మాసనం "అర్హత కలిగిన వారందరికీ 19.11.2024 లోపు రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశించింది.ఆ తరువాత, NFSA నిర్దేశించిన గరిష్ట పరిమితి ప్రకారం ఆదేశాలను ఖచ్చితంగా పాటించడానికి అనుమతించాలని కోరుతూ భారత ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఒక దరఖాస్తును దాఖలు చేసింది.