ప్రియుడితో కలిసి భర్తను చంపి, శవాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో సిమెంట్‌తో సీల్ చేసి...

Update: 2025-03-19 16:00 GMT
Merchant Navy Officer Saurabh Rajput

మా అల్లుడు మంచోడే, గుడ్డిగా ప్రేమించాడు... తప్పంతా మా బిడ్డదే - సౌరబ్ అత్తమామలు 

  • whatsapp icon

Saurabh Rajput's murder mystery: అమెరికాకు చెందిన ఒక కంపెనీలో మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న సౌరబ్ రాజ్‌పుత్ మార్చి 4న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కానీ మార్చ్ 18 వరకు ఆ మర్డర్ బయటికి రాకుండా ఆయన భార్య ముస్కాన్ రస్తోగీ జాగ్రత్తపడిన తీరు సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఆ మర్డర్ చేసింది ఇంకెవరో కాదు.. ఆమె, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా... ఇద్దరూ కలిసి సౌరబ్‌ను పొడిచి చంపారు. ఆ తరువాత శరబ్ శవాన్ని 15 ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో సీల్ చేశారు. ఈ హత్యతో తమకు ఏం సంబంధం లేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇద్దరూ కలిసి మరో నాటకం ఆడారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌరబ్ మర్డర్ కేసు వివరాలిలా ఉన్నాయి.

సౌరబ్‌ను హత్య చేసిన అనంతరం ఆయన ఫోన్ తీసుకుని హిల్స్ స్టేషన్స్‌కు వెళ్లారు. అక్కడ సౌరబ్ పోస్ట్ చేసినట్లుగా ఆయన సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. తద్వారా సౌరబ్ ఇంకా బతికే ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేశారు. ఒకవేళ సౌరబ్ మర్డర్ కేసు బయటికొచ్చినా ఇలా ఆ కేసును తప్పు దోవ పట్టించవచ్చనుకున్నారు.

అసలేం జరిగింది.. సౌరబ్ నేపథ్యం ఏంటి?

ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ సౌరబ్ స్వస్థలం. సౌరబ్ ఒక్కరే ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు. తన ఆరేళ్ల కూతురు బర్త్‌డే కోసమే గత నెల ఇండియాకు వచ్చారు. అత్తామామలతో కలిసి ఉండటం ఇష్టం లేని ముస్కాన్ భర్తతో పోరు పెట్టుకుని వేరు కాపురం పెట్టించింది. కోట్ల ఆస్తిని వదులుకుని భార్యపై ప్రేమతో సౌరబ్ ఆమె ఇష్ట ప్రకారమే చేశారు.

సౌరబ్ తల్లిదండ్రులకు అనుమానం

సౌరబ్ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ... ఆయన ఫోన్‌కు ఎంత ట్రై చేసినా ఫోన్ కలవకపోవడం పలు అనుమానాలు రేకెత్తించింది. అంతేకాకుండా మార్చి 6న సౌరబ్ చెల్లి చింకీకి ఆయన ఫోన్ నుండే ఒక వాట్సాప్ మేసేజ్ వచ్చింది. హోలీ పండగకు ఇంటికి వస్తావా అని అడగడానికి సౌరబ్ మెసేజ్ చేసినట్లుగా ఉంది. అందుకు సరే అంటూ చిక్కీ రిప్లై ఇచ్చారు.

మరో రెండు రోజుల తరువాత... అంటే మార్చి 8న చింకీ ఫోన్‌కు సౌరబ్ ఫోన్ నుండి మరో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తను హోలీకి ఇంట్లో ఉండటం లేదని, హోలీ తరువాతే ఇంటికి వస్తానని ఆ మెసేజ్‌లో ఉంది. ఆ మెసేజ్ చూసిన చింకీ... "కూతురును కూడా వెంటపెట్టుకుని వెళ్లావా?" అని ప్రశ్నించారు. చింకీ ప్రశ్నకు అవతలి నుండి లేదనే సమాధానం వచ్చింది. తను వెళ్లిన చోట -10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయని, ఇలాంటి చోటుకు వస్తే తను తట్టుకోలేదనే ఉద్దేశంతోనే తీసుకురాలేదని రిప్లై వచ్చింది.

మార్చి 15న చింకీ మరోసారి సోదరుడితో మాట్లాడేందుకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఫోన్ కాల్స్ ఎత్తకుండా ఎంతసేపూ మేసెజ్ల్‌లు మాత్రమే వస్తుండటంతో ఆ కుటుంబానికి వచ్చిన అనుమానం మరింత బలపడింది. ఇదే విషయమై సౌరబ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ముస్కాన్‌ను పోలీసులకు అప్పగించిన తల్లిదండ్రులు

సౌరబ్ మిస్సింగ్‌పై అనుమానాలు కలుగుతున్న సమయంలోనే మరో కీలక పరిణామం జరిగింది. సౌరబ్‌ను హత్య చేసిన ముస్కాన్ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి అక్కడ జరిగిందంతా చెప్పింది. ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి తనే సౌరబ్‌ను మర్డర్ చేసినట్లు అంగీకరించింది. దాంతో బిడ్డ వైఖరిని ఏ మాత్రం ప్రోత్సహించని ముస్కాన్ తల్లిదండ్రులు నేరుగా ఆమెను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. కనిపించకుండా పోయిన తమ అల్లుడు సౌరబ్ హత్యకు గురయ్యారని, ఆయన్ను చంపింది ఎవరో కాదు.. తమ కూతురే అని పోలీసులకు అసలు విషయం చెప్పారు.

పోలీసుల ఎదుట ముస్కాన్ తన నేరాన్ని అంగీకరించింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే ప్లాస్టిక్ డ్రమ్మును పలగొట్టి, సిమెంట్‌ను డ్రిల్ చేసి చూడగా అందులోంచి సౌరబ్ శవం ముక్కలుముక్కలుగా బయటపడింది. ఆ శరీర భాగాలను పోస్టుమార్టం రిపోర్ట్ కోసం తరలించారు.

మా బిడ్డను ఉరి తీయండి..

సౌరబ్ హత్యపై ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో ఉంటున్న ముస్కాన్ తల్లిదండ్రులు ప్రమోద్ కుమార్ రస్తోగీ, కవితా రస్తోగి స్పందించారు. "తమ అల్లుడు సౌరబ్ చాలా మంచి మనిషి... ముస్కాన్‌ను గుడ్డిగా ప్రేమించారు. ముస్కాన్ పోరు భరించలేక తల్లిదండ్రులను, కోట్ల రూపాయల ఆస్తిని వదిలేసుకుని వచ్చి వేరుగా కాపురం పెట్టారు" అని గుర్తుచేసుకున్నారు. సమస్య అంతా తమ బిడ్డతోనే వచ్చిపడిందన్నారు.

తమ అల్లుడు కూడా తమకు కొడుకు లాంటి వారే. ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. సౌరబ్‌ను చంపిన ముస్కాన్‌ను ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సౌరబ్ తల్లిదండ్రులకే తమ మద్దతు ఉంటుందని అన్నారు. 

Tags:    

Similar News