ఎప్పటికైనా బీహార్‌ను పాలించేది అతనే : ఉమభారతి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఉమభారతికి రాజకీయాల్లో మంచి ఫైర్ బ్రాండ్ గా పేరుంది. తరుచుగా ప్రతిపక్షాల పైన విరుచుకపడే ఆమె పొగడటం చాలా అరుదనే చెప్పాలి.

Update: 2020-11-12 11:16 GMT

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఉమభారతికి రాజకీయాల్లో మంచి ఫైర్ బ్రాండ్ గా పేరుంది. తరుచుగా ప్రతిపక్షాల పైన విరుచుకపడే ఆమె పొగడటం చాలా అరుదనే చెప్పాలి.. అయితే తాజాగా భోపాల్ లోని జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ .. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆయనకి రాష్ట్రాన్ని పాలించేంత అనుభవం లేకున్నా ఎప్పటికైనా బీహార్‌ను పాలించేది అతనేనని ఉమభారతి అన్నారు. ఇక తేజస్విని యాదవ్ మంచి కుర్రాడని, అతడికి మంచి భవిష్యత్‌ ఉందని ఉమభారతి వెల్లడించారు. ఒకవేళ ఇప్పుడు తేజస్వి యాదవ్‌ ముఖ్యమంత్రి అయి ఉంటే అధికారం మాత్రం ఆయన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేతిలోనే ఉండేదని ఉమభారతి వ్యాఖ్యానించారు.

ఇటివల జరిగిన బీహార్ ఎలక్షన్ ఫలితాల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ)125 స్థానాలతో విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ శాసనసభలో సాధారణ మెజార్టీ 122 కాగా, ఎన్‌డీఏ ఈ మార్క్‌ను దాటేసింది.. అటు మహాకూటమిలోని ఆర్జేడీ 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తరవాతి స్థానాలలోబీజేపీ (74) జేడీయూ (43), కాంగ్రెస్ (19), వామపక్షాలు (16), ఎంఐఎం (5), వీఐపీ, హెచ్ఏఎం (4) ఉన్నాయి. అయితే ఎన్నికల ఫలితాల ముందు ఎగ్జిట్ పోల్స్ సైతం తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాగట్‌బంధన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని అంచనా వేశాయి..అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి.. దీంతో మరోసారి ఎన్డీఏ బీహార్‌ లో అధికారంలోకి రానుంది. 

Tags:    

Similar News