కఠోరంగా శ్రమిస్తున్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

Tejashwi Yadav: బీహార్‌ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ ముఖ్య నాయకుడు తేజస్వీ యాదవ్‌ ఫిట్‌నెస్‌ కోసం చెమటోడుస్తున్నారు.

Update: 2022-07-25 15:30 GMT

కఠోరంగా శ్రమిస్తున్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

Tejashwi Yadav: బీహార్‌ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ ముఖ్య నాయకుడు తేజస్వీ యాదవ్‌ ఫిట్‌నెస్‌ కోసం చెమటోడుస్తున్నారు. చాలా రోజుల తరువాత బ్యాట్‌ పట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. పాట్నాలోని తన ఇంటి ఆవరణలో తాత్కాలిక క్రికెట్ పిచ్‌పై చెమటలు పట్టేలా ప్రాక్టీస్ చేస్తున్నారు. షార్ట్‌, టీషర్ట్‌, చేతులకు గ్లోస్‌ ధరించి భారీ షాట్లు కొట్టాడు. రెండు ప్లాస్టిక్ చైర్లను వికెట్లుగా ఉపయోగించుకుని బ్యాట్‌కు పనిచెప్పాడు. అతని డ్రైవర్, వంటవాళ్లు బౌలింగ్ వేస్తుంటే భారీ షాట్లు ఆడాడు. అనంతరం అతను కూడా బౌలింగ్ చేశాడు. అసలు తేజస్వీ యాదవ్ బ్యాట్ మళ్లీ ఎందుకు పట్టడాన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తేజస్వీ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఎఫెక్ట్‌ కారణంగానే బరువు తగ్గేందుకు శ్రమిస్తున్నట్టు కొందరు చెప్పుకుంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ, తేజస్వీ యాదవ్ కలుసుకున్నారు. ఆ సమయంలో బరువు తగ్గించుకోవాలని తేజస్వికీ ప్రధాని సూచించారు. ప్రధాని సూచన కారణంగానే తేజస్వీ పట్టినట్టు తెలుస్తోంది. అయితే తేజ‌స్వీ యాదవ్ ఒక‌ప్పుడు క్రికెట‌ర్‌. ఓ సారి ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జ‌ట్టు తేజస్వీని కొనుగోలు చేసింది. క్రికెట్‌కు స్వస్తీ చెప్పి తేజస్వీ రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవల ఆయనకు భారీగా పొట్ట పెరిగిపోయింది. ప్రధాని సూచనో లేక ఇంకేదైనా ప్రభావమో కానీ తేజ‌స్వి మ‌ళ్లీ స్లిమ్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బ్యాట్ తో భారీ షాట్లు ఆడుతున్న వీడియోను తేజస్వీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. జీవితం, ఆట ఎప్పుడూ గెలవడానికే ఆడాలని తేజస్వీ ట్వీట్‌ చేశారు.


Tags:    

Similar News