Pubg Game: పబ్జీ కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేశాడు!
Pubg Game: అతి ఏదైనా మంచిది కాదు.. ఎప్పటికైనా ప్రమాదమే.. సరదాగా మొదలు పెట్టిన పబ్జీ గేమ్ కి ఓ 17 ఏళ్ల కుర్రాడు ఎడిక్ట్ అయ్యాడు.
Pubg Game: అతి ఏదైనా మంచిది కాదు.. ఎప్పటికైనా ప్రమాదమే.. సరదాగా మొదలు పెట్టిన పబ్జీ గేమ్ కి ఓ 17 ఏళ్ల కుర్రాడు ఎడిక్ట్ అయ్యాడు. అదే ప్రపంచం అనుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసులు అని తల్లిదండ్రులకి సాకు చెప్పి పబ్జీకి సంబంధించిన వర్చువల్ అమ్యునీషన్ (యాప్స్) కొనుగోలు కోసం తన తండ్రి బ్యాంకు ఖాతాలోని రూ. 16 లక్షలు ఖర్చు చేశాడు. ఈ ఘటన పంజాబ్‌లోని ఖారర్ పట్టణంలో చోటు చేసుకుంది.
పబ్జీ అంటే పిచ్చి ఉన్న ఆ యువకుడు తనతోపాటు తన స్నేహితులకోసం కూడా ఈ ఆన్‌లైన్ గేమ్‌కు సంబంధించిన యాప్స్ కొనుగోలు చేయాలనీ అనుకున్నాడు. ఆన్‌లైన్ క్లాసుల అని చెప్పి తన తండ్రి ఫోన్ తీసుకొని అందులోనుంచి బ్యాంక్ ఖాతా ద్వారా రూ. 16 లక్షలు ఖర్చు చేసి, యాప్స్ కొనుగోలు చేశాడు. అంతేకాకుండా తన తల్లి పీఎఫ్ ఖాతానుంచి రూ. 2 లక్షలు విత్‌డ్రా చేశాడు. చివరగా బ్యాంకు స్టేట్‌మెంట్ ల ద్వారా ఆ కుర్రాడి తల్లిదండ్రులు విషయాన్ని తెలుసుకొని షాక్ అయ్యారు.
అయితే ఈ డబ్బుని ఆ యువకుడి తండ్రి వైద్యం కోసం దాచి పెట్టాడు. దీనిపైన అవగాహన లేని ఆ కుర్రాడు గేమ్ కి ఎడిక్ట్ అయిపోయి రూ. 16 లక్షలు ఖర్చు చేశాడు. ఇక్కడ మరోవిశేషం ఏంటంటే ఆ కుర్రాడు ఈ రూ. 16 లక్షలను కేవలం ఒక నెల వ్యవధిలోనే ఖర్చు చేయడం.. అయితే తన కొడుకు చేసిన తప్పుకి ఫలితంగా మరియు ఒక గుణపాఠం నేర్పించే ప్రయత్నంలో భాగంగా ఆ తండ్రి, ఆ కుర్రాడిని స్థానిక రిపేర్ షాప్‌లో స్కూటర్ మెకానిక్‌గా పనిలో పెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.