TATA Group: ప్రపంచ రికార్డుపై కన్నేసిన టాటా సంస్థ
* ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో సోలార్ పవర్ ప్లాంటుకు ఏర్పాట్లు * లదాఖ్‌లో 3,600 మీటర్ల ఎత్తులో సోలార్ పవర్ స్టేషన్
TATA Group: ప్రముఖ పారిశ్రామిక సంస్ధ టాటా ప్రపంచ రికార్డుపై కన్నేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిల్ స్టేషన్లలో ఒకటైన లదాఖ్‌లో కొత్తగా సోలార్ పవర్ ప్లాంటును నిర్మించనుంది టాటా పవర్ సంస్థ. లడాఖ్ ప్రధాన పట్టణమైన లేహ్ సమీపంలోని లైంగ్ విలేజ్ సమీపంలో భూమి నుంచి 3వేల 600 మీటర్ల ఎత్తులో ఈ సోలార్ పవర్ స్టేషన్‌ను నిర్మించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పిన సోలార్ పవర్ స్టేషన్‌గా స్విట్జర్లాండ్‌లోని జుంగ్‌ఫ్రాజోక్ గుర్తింపు ఉంది.
1991లో ఈ పవర్ స్టేషన్‌ని భూమి నుంచి 3వేల 454 మీటర్ల ఎత్తులో నెలకొల్పారు. ముప్పై ఏళ్లుగా ఇదే రికార్డుగా కొనసాగుతోంది. దీంతో 2023 మార్చి నాటికి పూర్తయ్యే లడాఖ్ ప్రాజెక్టుతో టాటా సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించనుంది.