మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి విషమం

అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది..

Update: 2020-09-01 12:21 GMT

అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. అతని ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా తక్కువగా ఉండటంతో సోమవారం రాత్రి ఆయనను జిఎంసిహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ప్లాస్మా థెరపీ ఇవ్వడం తోపాటు, ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉంచాలని వైద్యులు నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమానా బిస్వా శర్మ తెలిపారు. తరుణ్ గొగోయ్ భార్య డాలీ గొగోయ్ కి నిర్వహించిన పరీక్షలో కరోనా నెగటివ్ వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలతో కలిసి 'గ్రాండ్ అలయన్స్' ఏర్పాటు చేసే విషయంపై తరుణ్ గొగోయ్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా తన సొంత పార్టీ సభ్యులతో పాటు ఇతర సభ్యులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

గౌహతిలోని ఒక హోటల్‌లో జరిగిన కాంగ్రెస్ స్టేట్ యూనిట్ వర్కింగ్ కమిటీ సమావేశానికి తరుణ్ గొగోయ్ హాజరయ్యారు.. ఇటీవల ఆయన నివాసంలో పలు సమావేశాలను కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కరోనా భారిన పడ్డారు. అయితే ఆయన భార్య సహా ఇతర కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు చేయగా అందరికి నెగటివ్ అని వచ్చింది. దాంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుంటే అస్సాంలో మొత్తం లక్షా 9 వేల కేసులు నమోదు కాగా 85 వేల మందికి పైగా కోలుకున్నారు. 306 మంది మరణించారు. 

Tags:    

Similar News