School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..సెలవులు పొడిగింపు..సర్కార్ కీలక నిర్ణయం

School Holidays: ఆ రాష్ట్ర విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. నాలుగు రోజులు సెలవులు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2024-09-30 07:27 GMT

 School Holidays

School Holidays: స్కూల్ పిల్లలకు తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. అక్టోబర్ రెండు వరకు ఉన్న సెలవులను అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదట మధ్యంతర సెలవులను సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ రెండు వరకు మాత్రమే ప్రకటించారు. మొత్తం ఐదు రోజులు మాత్రమే సెలవులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం పిల్లలకు అక్టోబర్ ఆరు వరకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరిగి పాఠశాలలు అక్టోబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఉపాధ్యాయుల సూచన మేరకే తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రభుత్వ, ఎయిడెడడ్, ప్రైవేటు పాఠశాలలు అక్టోబర్ 6 మూసి ఉంటాయి. మళ్ళీ పాఠశాలలో అక్టోబర్ 7న తెరుచుకుంటాయి.

ఇదిలా ఉంటే తెలంగాణలో అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ 14 వరకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ పండుగకు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు దీని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెలవులను ప్రకటించింది. తెలంగాణలో బతుకమ్మ దసరా వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి గ్రామాలకు తరలి వెళ్తారు. దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ సెలవులను ప్రకటించింది. సెలవల అనంతరం మళ్లీ పాఠశాలలు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సైతం దసరా సెలవులపై క్లారిటీ వచ్చింది. ఆ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 3 నుంచి 13 వరకూ 11 రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మళ్లీ తిరిగి పాఠశాలలో అక్టోబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం దసరా సెలవులు సరదాగా గడుపుకోవాలని పిల్లలకు ఈ సంవత్సరం అత్యధికంగా సెలవులు అందజేసింది.

Tags:    

Similar News