MP Jothimani: 'నా బట్టలు చించారు'.. మహిళా ఎంపీ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?

MP Jothimani: జ్యోతిమణి వీడియోను పోస్టు చేసిన ఎంపీ శశిథరూర్‌

Update: 2022-06-16 11:21 GMT

MP Jothimani: 'నా బట్టలు చించారు'.. మహిళా ఎంపీ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?

MP Jothimani: కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఆ పార్టీ శ్రేణులపై ఢిల్లీ పోలీసుల దాడులు తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్‌ కార్యకర్తలను, నాయకులపై విచక్షణ రహింతంగా పోలీసులు దాడులు చేసినట్టు ఆరోపిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా దుస్తులను చించేశారని.. తమను అరెస్టు చేసి.. గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లినట్టు ఆరోపిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని కరూర్‌కు చెందిన కాంగ్రెస్‌ మహిళా ఎంపీ జ్యోతిమణి పోలీసుల దాడి తీరుపై సెల్ఫీ వీడియాలో స్పీకర్‌కు విన్నవించారు. ఢిల్లీ పోలీసులు తమ పట్ల దారుణంగా వ్యవమరించారని జ్యోతిమణి ఆరోపించారు. తన దుస్తులు చించేశారని ఆమె చూపించారు. నేరస్థుల్లా తమను ఈడ్చుకెళ్లారని తమ షూను లాగేశారని ఆరోపించారు. కనీసం తాగడానికి నీళ్లు అడిగినా ఇవ్వలేదని ఆరోపించారు. వాటర్‌ బాటిల్‌ను కొనుగోలు చేయడానికి వెళ్తే దుకాణాల వారిని ఇవ్వొద్దని బెదిరించినట్టు వాపోయారు. మహిళా ఎంపీ పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు.

జ్యోతిమణి వీడియోను కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ట్విట్టర్‌ పోస్టు చేశారు. మహిళా నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలోనే ఇది అత్యంత దారుణమైన ఘటన అని ఆరోపించారు. తమ పట్ల పోలీసుల ప్రవర్తించిన తీరు.. ప్రతి భారతీయుడి మర్యాదకు భంగం కలిగించినట్టేనని.. లోక్‌సభ ఎంపీకే ఇలా జరిగితే.. సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. జ్యోతిమణి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. స్పీకర్‌జీ దయచేసి చర్చలు తీసుకోవాలని శశిథరూర్ డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌పై ఈడీ విచారణ నేపథ్యంలో మూడ్రోజులగా ఢిల్లీలో జరుగుతున్న ఆ పార్టీ శ్రేణుల ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పోలీసులకు, కాంగ్రెస్‌ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేశారు. అయితే మహిళా పోలీసులతో దురుసగా ప్రవర్తించారని.. కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అయితే ఈ రోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. నిషేధాజ్ఞల నేపథ్యంలో నిరసన ర్యాలీలు జరగకుండా అడ్డుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ఏఐసీసీ కార్యాలయం గేటు మూసేందుకే తాము ప్రయత్నించినట్టు తెలిపారు. అయితే ఈ క్రమంలో కొంత ఘర్షణ చోటుచేసుకున్నదని పోలీసులు అంగీకరించారు. అయితే తాము ఏఐసీసీ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News