Ponmudy: అవినీతి కేసులో తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్లు జైలు శిక్ష
Ponmudy: తమిళనాడు మంత్రి పొన్ముడికి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు
Ponmudy: తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడికి మద్రాస్ హైకోర్టు్ షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పొన్ముడిని దోషిగా మద్రాస్ హైకోర్టు నిర్ధారించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంత్రి పొన్ముడికి హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అతడితో పాటు తన భార్యకు 50 లక్షల జరిమానా వేసింది. అతడిపై ప్రస్తుతం మంత్రి బాధ్యతలు ఉండటంతో 30 రోజుల జైలు శిక్షను సస్పెండ్ చేసింది. తన వయస్సును పరిగణలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని మంత్రి పొన్ముడి కోర్టును కోరారు. ఉన్నత అప్పీలుకు వెళ్లేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.