Tamil Nadu: సొంత కారు కూడా లేదంటున్న డిఎంకే నేత స్టాలిన్
Tamil Nadu: తనకు రూ. 2.24 కోట్ల విలువైన స్థిర, రూ. 4.94 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో స్టాలిన్ పేర్కొన్నారు.
Tamil Nadu: ఎమ్మెల్యేగా వస్తున్న జీతం, బ్యాంకు డిపాజిట్లు, అద్దెల ద్వారా తనకు ఆదాయం వస్తోందని, తనకు సొంత కారు లేదని తెలిపారు. బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు తనకు ఎలాంటి బకాయిలు లేవని తమిళనాడు లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో ప్రకటించారు.
తనకు రూ. 2.24 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 4.94 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. స్థిరాస్తులలో వ్యవసాయ భూమి, రెసిడెన్సియల్ భవంతులను చూపించారు. తన చేతిలో రూ. 50 వేల నగదు ఉందని తెలిపారు. మరోవైపు తన భార్య పేరిట రూ. 30,52,854 విలువైన చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తన భార్యకు రూ. 24.77 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని వెల్లడించారు.
స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన కూడా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో ప్రకటించారు. తనకు రూ. 21.13 కోట్ల చరాస్తులు, రూ. 6.54 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
తమిళనాడులో డీఎంకే కూటమి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందని ప్రీ-పోల్ సర్వేలు చెబుతున్నాయి. అధికార అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి భంగపాటు తప్పదని టైమ్స్ నౌ-సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలే తమిళనాడులో పునరావృతం అవుతాయని భావిస్తున్నారు.