తెరుచుకున్న తాజ్ మహల్.. తోలి టూరిస్టు ఎవరంటే?

Taj Mahal Reopens : ప్రపంచంలోని ఏడూ వింతల్లో ఒకటైనా తాజ్ మహల్ మళ్ళీ వీక్షకులను మంత్రముగ్ధులను చేసేందుకు రెడీ అయింది.. కరోనా

Update: 2020-09-21 07:43 GMT

Taj Mahal

Taj Mahal Reopens : ప్రపంచంలోని ఏడూ వింతల్లో ఒకటైనా తాజ్ మహల్ మళ్ళీ వీక్షకులను మంత్రముగ్ధులను చేసేందుకు రెడీ అయింది.. కరోనా కారణంగా ఆరు నెలల పాటు మూత పడ్డ తాజ్ మహల్.. ఈ రోజు (సోమవారం) నుంచి సందర్శకులకు తాజ్ ని వీక్షించేందుకు అనుమతిని కల్పించారు. అయితే ముందుగా వెళ్లే పర్యాటకులు జనరల్‌గా భారతీయులే అయినప్పటికీ మొదటి టూరిస్టు మాత్రం ఓ తైవాన్ పర్యాటకుడు కావడం విశేషం.. ఇప్పటికే అతను టికెట్ బుక్ చేసుకొని తాజ్‌ మహల్ ఎంట్రీ గేటు దాటి తాజ్ ఎదురుగా ఉండే ఫేమస్ బెంచీపై కూర్చొని తొలి ఫొటో కూడా దిగాడు.

ఇక కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. కేవలం రోజుకు 5వేల మందికి మించకుండా పర్యాటకులను మాత్రమే తాజ్ మహల్ సందర్శనకు అనుమతిస్తారు. ఇక ఆగ్రా కోటను రోజుకు 2500 మంది మాత్రమే చూసే వీలును కల్పించారు.. రెండు కట్టడాలకూ టికెట్ ఇచ్చే కిటికీ మూసి ఉంటుంది. టూరిస్టులు భారత పురావస్తు శాఖ (ASI) వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కట్టడాలపై ఉండే... QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా... లోపలికి అనుమతిస్తారు. ఇక మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరియు అతని భార్య ముంతాజ్ మహల్ సమాధులు ఉన్న ప్రధాన సమాధిలోకి ఒకేసారి ఐదుగురు సందర్శకులను మాత్రమే అనుమతించనున్నారు.. దీనికి గాను 200 రూపాయలు చెల్లించాల్సి ఉండగా విదేశీయులు ఇంకా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇక టూరిస్టులు లోపలికి ఎంటర్ అయ్యే ముందే థెర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. కరోనా లక్షణాలు లేని పర్యాటకుల్ని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు.. కట్టడాల దగ్గర తప్పనిసరిగా సేఫ్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు ధరించాల్సి ఉంటుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తాజ్ మహల్ ని మార్చి 17 నుండి మూసివేశారు.. ఇక ఈ రోజుకు తాజ్ సందర్శనకు గాను సుమారు 160 టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేయబడ్డాయి. 

Tags:    

Similar News