West Bengal: బీజేపీ నేత సువేందు అధికారికి ఈసీ నోటీసులు
West Bengal: నందిగ్రామ్ నుండి దీదీపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి ఈసీ నోటీసులు జారీ చేసింది.
West Bengal: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై బీజెపీ నేత సువేందు అధికారి పోటీ చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయంటూ అందిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. దీనిపై 24 గంటల్లోగా స్పందించాలని ఈసీ సువేందును ఆదేశించింది.
ప్రచారంలో భాగంగా ఇతర పార్టీలపై నిరాధార ఆరోపణలు చేయొద్దని.. మతం, కులం ఆధారంగా ఓట్లు అడగొద్దని ఈసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో ఉంది. అయితే, ఈ నిబంధనల్లోని కొన్ని క్లాజ్‌లను మార్చి 29న నందిగ్రామ్‌లో చేసిన ప్రసంగంలో సువేందు ఉల్లంఘించారని సీపీఐ-ఎంఎల్ నేత కవితా కృష్ణన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీకి పోటీగా బీజేపీ సువేందు అధికారిని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తృణమూల్‌లో దీదీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన.. పార్టీ మారి ఆమెపైనే పోటీ చేయడం సర్వత్రా ఉత్కంఠకు తెరతీసింది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల్లో డబ్బు పంచి ఓట్లు సాధించుకోవడం ప్రధానంగా సాగాయి ఈ ఎన్నికలు.