AK Rao Death Case: ఏకే రావు మృతి కేసులో కొనసాగుతున్న సస్పెన్స్

* ఏకే రావు మృతదేహానికి శవపరీక్ష పూర్తి * నివేదిక కోసం ఎదురుచూస్తున్న రైల్వే పోలీసులు

Update: 2021-11-28 05:15 GMT

ఏకే రావు మృతి కేసులో కొనసాగుతున్న సస్పెన్స్(ఫైల్ ఫోటో)

AK Rao Death Case: ఏకే రావు మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన మృతదేహానికి ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అయితే నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు రైల్వే పోలీసులు. గతంలో ఏకే రావుపై బెంగళూరులో కేసు నమోదయింది.

ఏకే రావు పేరిట ఉన్న లోన్‌ కన్సల్టెన్సీ కంపెనీ ద్వారా రుణాలిస్తామని ఫైనార్షియర్లు ఆమ్‌స్ట్రాంగ్‌, వివేకానంద కుమార్‌, రవి రాఘవన్‌ నమ్మించారు. గిరీష్‌, తరమ్‌ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి 6కోట్ల రూపాయలు వసూలు చేశారు ఫైనాన్సియర్లు. దీంతో ఏకే రావును బాధితులు నిలదీశారు.

అనంతరం ఈనెల 18న ఫైనాన్సియర్లు, ఏకే రావుపై బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 22న పోలీసుల ఎదుట ఏకే రావు విచారణకు హాజరుకాగా మరుసటి రోజు రైల్వే ట్రాక్‌పై ఏకే రావు మృతదేహం లభ్యమైంది. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఏముందో తెలిస్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News