రియా చక్రవర్తిని ప్రశ్నిస్తోన్న ఎన్‌సిబి.. ప్రేమ నేరం, అందుకే శిక్ష..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ డ్రగ్స్ కేసులో..

Update: 2020-09-06 09:44 GMT

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ డ్రగ్స్ కేసులో మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సిబి) రియా చక్రవర్తిని విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ సహాయకుడు దీపేశ్ సావంత్, అబ్దుల్ బాసిత్, జైద్ విలాత్రా, షోవిక్ చక్రవర్తి (రియా సోదరుడు), శామ్యూల్ మిరాండా, అబ్బాస్ లఖానీలను ఇప్పటివరకు అరెస్టు చేశారు. దీపేశ్‌ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ 9 వరకు ఎన్‌సిబి కస్టడీ కోసం రిమాండ్‌కు తరలించారు. కైజాన్ ఇబ్రహీంను కూడా అరెస్టు చేశారు,

కాని శనివారం ఆయనకు కోర్టు నుండి బెయిల్ లభించింది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ మనశిందే మాట్లాడుతూ.. రియా ఎటువంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉందని అని అన్నారు. ప్రేమించడం నేరం అయితే, అది ప్రేమ యొక్క ఫలితాలను ఇలాగె ఇస్తుందేమో అని అన్నారు. ఆమె నిర్దోషి కాబట్టే.. బీహార్ పోలీస్ లకు, సిబిఐ, ఈడి , ఎన్‌సిబిలను ఎదుర్కొన్నారు, కాని ముందస్తు బెయిల్ కోసం ఏ కోర్టును ఆశ్రయించలేదు అని అన్నారు.

మరోవైపు దీపేశ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఎన్‌సిబికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశామని అన్నారు.. దీపేశ్ కుటుంబానికి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా సెప్టెంబర్ 4 నుంచి తన క్లయింట్‌ను ఎన్‌సిబి అదుపులోకి తీసుకుందని.. న్యాయవాది అన్నారు. వాస్తవానికి అరెస్టైన 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నా.. ఆలస్యం చేశారని అంటున్నారు. దీంతో ఎన్‌సిబికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసినట్టు స్పష్టం చేశారు. 

Tags:    

Similar News