EWS రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు.. విద్యలో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లకు అనుమతి

Supreme Court: EWS రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తోంది.

Update: 2022-11-07 05:35 GMT

EWS రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు.. విద్యలో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లకు అనుమతి

Supreme Court: EWS రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సీజేఐతో సహా నలుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని తీర్పు ఇచ్చింది. ఈ రిజర్వేషన్‌ ఇవ్వడంలో ఎలాంటి వివక్ష లేదని, ఇది రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను ధర్మాసనంలోని నలుగురు సభ్యులు సమర్థించారు. జస్టిస్‌ రవీంద్రభట్‌ మాత్రం మిగతా నలుగురి తీర్పుతో విభేదించారు.

2019 సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్లు కల్పించింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

Tags:    

Similar News