Supreme Court: ప్రొఫెసర్ సాయిబాబాకు షాకిచ్చిన సుప్రీం కోర్టు
Supreme Court: బాంబే హైకోర్టు తీర్పును నిలిపివేసిన సుప్రీం
Supreme Court: ఫ్రొఫెసర్ సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సస్పెండ్ చేసింది. సాయిబాబాతో సహా ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు తీర్పుపై ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఫ్రొఫెసర్ సాయిబాబాకు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే సాయిబాబా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా గృహనిర్భంధం చేయాలన్న న్యాయవాది బసంత్ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా వేసింది.