'రాజద్రోహం చట్టం'పై స్టే విధించిన సుప్రీంకోర్టు
*పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ
Supreme Court: రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దేశద్రోహం సెక్షన్ 124A అమలుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్లపై విచారణ జరుపుతున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దేశద్రోహం కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసుల్లోనూ చర్యలు తీసుకోవద్దని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేసులు నమోదు చేయొద్దని, కేంద్రం పున:పరిశీలన పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోవద్దని తెలిపారు. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమన్నారు సీజేఐ ఎన్వీ రమణ.