NEET PG-2021: విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court: మెడికల్ సీట్ల ఖాళీలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
Supreme Court: మెడికల్ సీట్ల ఖాళీలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 1,456 మెడికల్ సీట్లు ఖాళీ ఉండటంపై అసంతృప్తి చెందిన సుప్రీంకోర్టు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021-22లో మిగిలిపోయిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై మండిపడింది సుప్రీంకోర్టు. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకపోతే వారికి పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. రేపు కోర్టులో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరుకావాలని సూచించింది.