కరోనా వైరస్ విజృంభణ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
కోవిడ్ కట్టడికై అన్ని రాష్ట్రాల ప్రభుత్వలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు వెలువరించింది.
కోవిడ్ కట్టడికై అన్ని రాష్ట్రాల ప్రభుత్వలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు వెలువరించింది. గుజరాత్, ఢిల్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యా సర్కార్లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. డిసెంబరులో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చనుందన్న వార్తల నేపథ్యంలో పరిస్థితులు దిగజారకముందే జాగ్రత్తపడాలని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.
కరోనాని ఎదుర్కునేందుకు కేంద్రం నుంచి ఎటువంటి సాయం కోరుకుంటున్నాయో కూడా నివేదిక అందజేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అన్ని రాష్ట్రాలు రెండు రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్‌ఎస్ రెడ్డి, ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.