Supreme Court: రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష.. జీవిత ఖైదు అనుభవిస్తున్న పెరరివలన్ రిలీజ్‌కు ఆదేశం
Supreme Court: ఢిల్లీ రాజీవ్‌గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Supreme Court: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకుపైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి. పేరరివాళన్‌ను విడుదల చేయాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పేరరివాళన్ విడుదలతో ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తోన్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర దోషుల విడుదలకు కూడా మార్గం సుగమమైనట్లైంది.