Supreme Court: కోవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

Supreme Court: కోవిడ్ మృతుల కుటుంబాలకు కనీస ఎక్స్‌గ్రేషియా అయినా చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Update: 2021-06-30 15:00 GMT

Supreme Court: కోవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి 

Supreme Court: కోవిడ్ మృతుల కుటుంబాలకు కనీస ఎక్స్‌గ్రేషియా అయినా చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపుపై 6 వారాల్లోగా మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పింది. ఎలాంటి ఎక్స్‌గ్రేషియా చెల్లించలేమంటూ కేంద్రం వేసిన అఫిడవిట్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

జస్టిస్ అశోక్ భూషణ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ తాజా ఆదేశాలిచ్చింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఆరు వారాల్లోగా నిర్ధారించాల్సిందిగా ఎన్‌డీఎంఏను కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. కోవిడ్‌‌తో మృతి చెందిన కేసుల్లో డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు మార్గదర్శకాలను సులభతరం చేయాలని కూడా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News