అనంత పద్మనాభస్వామి టెంపుల్ లావాదేవీలపై ఆడిట్‌ నిర్వహించాలన్న సుప్రీం

* ఆదాయ, వ్యయాల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు * 25ఏళ్లలో జరిగిన లావాదేవీలపై ఆడిట్‌ నిర్వహించాలన్న సుప్రీం

Update: 2021-09-23 16:00 GMT

అనంత పద్మనాభస్వామి టెంపుల్ (ఫోటో: లైవ్ లా)

Anantha Padmanabha Swamy Temple: కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం మరోసారి హాట్‌టాపిక్ అయింది. ఈ ఆలయానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. ఆలయ ఆదాయ, ఖర్చుల ఆడిట్‌ విషయంలో ట్రస్టుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆలయంతో సహ ట్రస్టుకు సంబంధించి గత 25ఏళ్లలో జరిగిన లావాదేవీలు, ఆదాయాలపై ఆడిట్‌‌ను కచ్చితంగా నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిని మూడు నెలల్లోనే పూర్తిచేయాలని గడువు విధించింది.

Tags:    

Similar News