ఇళ్లల్లో కూడా ప్రజలు మాస్కులు ధరిస్తున్నారు.. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

* ఇళ్లల్లో కూడా మాస్కులు ధరించే పరిస్థితి ఉందన్న సీజేఐ * కాలుష్య నివారణకు అత్యవసర చర్యలు తీసుకోవాలి -సుప్రీం

Update: 2021-11-13 08:02 GMT

 ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ(ఫైల్ ఫోటో)

Supreme Court: ఢిల్లీలోని వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఘాటు వ్యాఖ‌్యలు చేశారు. ప్రజలు బలవంతంగా ఇళ్లలో కూడా మాస్క్‌లు ధరిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటీషన్‌ను విచారిస్తున్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిన చీఫ్‌ జస్టిస్‌ వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారని సొలిసిటర్‌ జనరల్‌ను ప్రశ్నించారు.

అదేవిధంగా పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలు పంట వ్యర్థాలు తగులబెట్టకుండా ఏం చర్యలు తీసుకున్నారని సుప్రీం ప్రశ్నించింది. దీంతో ఇవాళ వాయుకాలుష్యంపై సొలిసిటర్‌ జనరల్‌ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కాగా రెండు, మూడు రోజుల్లో కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Full View


Tags:    

Similar News