Supreme Court: ఒకే దేశం ఒకే రేషన్ కార్డుపై సుప్రీంకోర్డు కీలక వ్యాఖ్యలు

Supreme Court: ఒకేదేశం.. ఒకే రేషన్‌కార్డును అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందే: సుప్రీంకోర్టు

Update: 2021-06-29 09:59 GMT

భారత అత్యున్నత న్యాయస్థానం (ఫైల్ ఫోటో)

Supreme Court: వన్ నేషన్.. వన్ రేషన్ కార్డుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు పథకాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జులై 31లోగా పథకాన్ని ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది. వలస కార్మికులు ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు పేర్లను నమోదు చేసుకునేలా ఓ పోర్టల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకంతో వలస కార్మికులు తాము పనిచేసే చోటే రేషన్ ను తీసుకునే వీలు కలుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

కరోనాతో ఆర్థికంగా బాగా చితికిపోయిన వలస కార్మికుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు పలు ఆదేశాలు ఇచ్చింది. మహమ్మారి ఉన్నన్నాళ్లూ వలస కార్మికులకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వాలని, కమ్యూనిటీ కిచెన్ సెంటర్లను కొనసాగించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఆహార ధాన్యాలను కేటాయించాలని ఆదేశాలిచ్చింది. అసంఘటిత రంగ కార్మికులతో జాతీయ డేటాబేస్‌ రూపకల్పనలో కీలకమైన సాప్ట్ వేర్ అభివృద్ధి ఆలస్యమవడాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. జులై 31లోగా సాప్ట్‌వేర్ ను అభివృద్ధి చేసి డేటాబేస్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. కార్మికుల నమోదు కోసం రాష్ట్రాలూ కాంట్రాక్టర్లందరి వివరాలనూ వీలైనంత త్వరగా నమోదు చేయాలని సూచనలిచ్చింది.

Tags:    

Similar News