కోర్టు ధిక్కార కేసులో ప్రశాంత్ భూషణ్‌కు ఒక్క రూపాయి జరిమానా

Update: 2020-08-31 07:43 GMT

Prashant Bhushan: కోర్టు ధిక్కరణ కేసులో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు శిక్ష ఖరారు చేసింది సుప్రీంకోర్టు. దీనిలో భాగంగా ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సెప్టెంబర్‌ 15లోగా రూపాయిని కోర్టుకు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. డిపాజిట్‌ చేయకపోతే 3 నెలల జైలుశిక్ష , మూడేళ్లపాటు ప్రాక్టీస్‌ చేయకుండా నిషేధం విధిస్తామని తీర్పులో హెచ్చరించింది.

కాగా సర్వోన్నత న్యాయవ్యవస్థ పనితీరు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు సంబంధించి ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. నలుగురు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తులపై ట్విట్టర్‌లో విమర్శించారు. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తిపైనా విమర్శలు చేశారు. ఈ ట్వీట్లు కించపరిచే విధంగా, కోర్టు ధిక్కార స్వభావంతో ఉన్నట్లు ఆగస్టు 14న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆగస్టు 20న ఆయనకు శిక్ష విధించవలసి ఉంది. కానీ ఈ ట్వీట్లపై పునరాలోచించుకుని, కోర్టుకు క్షమాపణ చెప్పేందుకు ఆయనకు 3 రోజుల గడువు ఇచ్చింది. అయితే ఇవి తాను నిజాయితీతో వ్యక్తం చేసిన అభిప్రాయలని, అందువల్ల తాను క్షమాపణ చెప్పబోనని ప్రశాంత్ భూషణ్ చెప్పారు.

Tags:    

Similar News