NEET UG Exam: నీట్ పరీక్ష అవకతవకలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
NEET UG Exam: మూడు పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం
NEET UG Exam: నీట్ పరీక్షలో అవతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నీట్ ప్రవేశ పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. పేపర్ లీకేజీ, అక్రమాలు, గ్రేస్ మార్కులపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 10 గంటల 30 నిమిషాలకు బెంచ్ వద్దకు ఈ పిటిషన్లు రానున్నాయి. రెండ్రోజుల క్రితం సైతం పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.
అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయని పేర్కొంది. కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే విధేంచేందుకు సైతం ధర్మాసనం నిరాకరించింది. అయితే పరీక్షపై వచ్చిన ఆరోపణలపై స్పందించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAకి నోటీసులు జారీ చేసింది. నాటి విచారణను జులై 8కి వాయిదా వేయగా.... ఆలోపు ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని NTAకు కోర్టు ఆదేశించింది.